రెండు రోజులు వర్షాలు
ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రెండు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షా లు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, నిజామాబాద్, జగిత్యా ల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రా ద్రి, ఖమ్మ, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడుతాయని చెప్పింది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.