11-02-2025 07:07:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఫిబ్రవరి మాసంలోని విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యుత్ శాఖ అధికారి సుదర్శన్ తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 73 అదనపు ట్రాన్స్ఫర్లను ఏర్పాటు చేయడం జరిగిందని 32 ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచడం జరిగిందని చిన్నచిన్న మరమ్మతులు చేసి చేపట్టి విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
రైతులు యాసంగిలో సాగుచేసిన పంటలకు బోరు మోటర్లను వినియోగించడం వల్ల డిమాండ్ పెరిగిందని వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు అందించేందుకు చర్య తీసుకున్నామన్నారు. అన్ని గ్రామాల్లో మండలాలు విద్యుత్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని కరెంటు సరఫరాలో అంతరాయం ఉంటే వారిని వెంటనే సంప్రదించాలని సూచించారు.