calender_icon.png 21 February, 2025 | 8:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు

20-02-2025 04:24:22 PM

ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి..

ముత్తారం మండలంలో ఇసుక క్వారీల తనిఖీలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్..

రామగుండం (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణాను నియత్రించేందుకు సమర్థవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ అన్నారు.‌ పెద్దపల్లి జోన్ మంథని ముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఖమ్మంపల్లి, జిల్లాలపల్లిలోని ఇసుక తరలించే ఇసుక క్వారీలను సీపీ ఆకస్మికంగా సందర్శించారు.  క్వారీ సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికరులను ను అడిగి తెలుసుకున్నారు. వాహనాల వే బిల్స్, లోడ్ పరిమితి నీ పరిశీలించారు.

ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో వుంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సీపీ అధికారులకు సూచించారు. ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో కూడా తప్పనిసరిగా పరిశీలించాలని, నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని కమిషనర్ సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న ర్యాంపుల నుండి ఇసుక తరలించే విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి డా. చేతన, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి రాఘవేంద్ర, గోదావరిఖని ఎసిపి రమేష్, మంథని సిఐ రాజు, ముత్తారం ఎస్ ఐ నరేష్ పాల్గొన్నారు.