calender_icon.png 15 January, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్బీఐ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవ్

31-08-2024 04:13:16 PM

ఆగడాలకు పాల్పడితే... కేసులు నమోదు చేస్తాం...

కల్లూరు  ఎస్సై షేక్ షాకీర్

ఖమ్మం, ( విజయక్రాంతి): మండలంలో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలకు చిన్న సన్న నిరుపేద మహిళలకు రుణాలు ఇచ్చి వసూలు చేయడం విషయంలో ఇబ్బంది పెట్టిన, ఆగడాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని ఎస్సై షేక్ షాకీర్ అన్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై షాకీర్ మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో మైక్రో ఫైనాన్స్, సూక్ష్మ రుణాలు స్వయం సహాయక సంఘాలు, మహిళలు 5 గురు సభ్యులతో ఒక గ్రూపుగా ఏర్పాటు చేసికొని రుణాలు తీసుకుంటున్నారు. రుణాలు తీసుకున్న సభ్యులలో ఎవరైనా ఒకరు కట్టకపోయినా రాత్రి సమయంలో ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారన్న విషయం మా దృష్టికి వచ్చిందని అన్నారు.

ఎవరికైనా ఇబ్బంది కలిగితే అత్యవసర పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కు ఫోన్ చేసిన వెంటనే సహాయ సహకారాలు ఉంటాయని భరోసా కల్పించారు. దీంతో మైక్రో ఫైనాన్స్ రుణాలు తీసుకున్న బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వారు 100 కు ఫోన్ చేసి మా దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. నెల రోజులుగా మహిళల నుండి 100 కు ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు.మైక్రో ఫైనాన్స్ ద్వారా రుణాలు తీసుకున్న గ్రూప్ సభ్యుల ఇళ్లకు రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులలో వెళ్ళవద్దని ఆయన సూచించారు. ఆర్.బి.ఐ నిబంధనలు అనుసరించకుండా రాత్రి సమయాలలో వెళ్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు.మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వారి యొక్క నిబంధనలు ప్రకారం ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల లోపే వసూలు చేయాలని కోరారు.

గ్రామాలలో సాయంత్రం 6 గంటల తర్వాత వారి ఇళ్లకు వెళ్లి ఇబ్బంది పెట్టిన, కించపరిచే విధంగా మాట్లాడిన, దురుసుగా ప్రవర్తించిన అట్టి విషయం మా దృష్టికి తీసుకు వస్తే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మైక్రో ఫైనాన్స్ సిబ్బంది మితిమీరిన, ఆగడాలు, పోకడలు చేస్తే రాత్రి సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా పాల్పడితే అట్టి విషయాన్ని, సిబ్బంది పూర్తి సమాచారంను మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికైనా ఫైనాన్స్ సంస్థలు సిబ్బంది 6 గంటల దాటిన తర్వాత వారి ఇళ్లకు వెళ్లొద్దని తెలియజేశారు.