జిల్లా కేంద్రంలో సబ్జాకు గురైన నాల తొలగింపు
పలువురికి నోటీసులు జారీ
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని ఆర్డిఓ లోకేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్ సమీపంలో కబ్జాకు గురైన నాలాను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. బిలా ధకల్ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నాలను కబ్జా చేయడంతో తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు తొలంగించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిలో ఇండ్ల నిర్మాణం చేపట్టిన పలువురికి ఇప్పటికే నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కబ్జాల తొలగింపు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట తాహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే, ఇరిగేషన్ డి ఈ దామోదర్, సీఐ రవీందర్, ఎస్సై రాజేశ్వర్ సంబంధిత అధికారులు ఉన్నారు.