calender_icon.png 14 November, 2024 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్‌పై చర్యలు

13-11-2024 01:50:00 AM

  1. ఫార్ములా ఈ రేసు కేసు విచారణ నుంచి 
  2. తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ టూర్
  3. కలెక్టర్‌పై దాడి చేసినవారు ఊచలు లెక్కించాల్సిందే 
  4. అమృత్ టెండర్లపై లీగల్‌గా ఫైట్ చేసుకోవచ్చు 
  5. రెడ్డి పేరున్న వారంతా నా బంధువులు కాదు 
  6. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : ఫార్ములా ఈ-రేసు స్కామ్‌లో గవర్నర్ అనుమతి రాగానే మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలుంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చేసి న వారిని, ఆ దాడికి ఉసిగొల్సిన వారిని వదిలిపెట్టబోమని, ఎంతటివారైనా ఊచ లు లెక్కపెట్టాల్సిందేనని హెచ్చరించారు.

మంగళవారం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారులను చంపాలని చూస్తున్న వారిని బీఆర్‌ఎస్ ఎలా సమర్థిస్తుందని మండిపడ్డారు. అమృత్ టెండర్లపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, అభ్యంతరాలుంటే లీగల్‌గా ఫైట్ చేసుకోవచ్చని సూచించారు.

సృజన్‌రెడ్డి బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డికి అల్లుడని.. బీఆర్‌ఎస్ హయాంలోనే అతనికి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చాయని స్పష్టంచేశారు. రెడ్డి పేరున్న వారంతా తన బంధువులు కాదని రేవంత్ స్పష్టంచేశారు. ఫార్ములా ఈ రేసులో విచారణ నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు.  

ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఎలా సాధ్యం? 

‘కాంగ్రెస్ పార్టీ ఫార్మాట్ మార్చుకోవాలి. మా పార్టీ నాయకులు టెస్టు మ్యాచ్ ఆడుతున్నారు. ఇప్పుడు 2020 ఫార్మాట్ నడుస్తోంది. మేం అదే ఫార్మా ట్ ప్రకారం ఆడాలి లేదంటే మార్చుకోవాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీలో నిర్వహించిన ‘అడ్డా’ అనే కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరై, మాట్లాడారు.

తాము సర్కార్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా పదేళ్లలో మోదీ ప్రభుత్వం దేశ ప్రజలను ఎలా మో సం చేసిందో ప్రజలకు చెప్పామని అన్నారు. అన్నదాతలకు వ్యతిరేకంగా, రాజ్యాంగం రద్దుకు ప్రయత్నించిన తీరును జనానికి వివరించామని, బీజేపీ రహస్య ఎజెండాను బయటపెట్టామని స్పష్టంచేశారు. ఆ పార్టీ రహస్య అజెండా వేరు.. ఎన్నికల ముందు చెప్పే అజెండా వేరని విమర్శించారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయ న్న వారు 240 సీట్లే సాధించారని, కాంగ్రెస్ పార్టీ 40 సీట్ల నుంచి వందకు చేరిందని, వచ్చిన ఎంపీ సీట్లను చూస్తే ఎవరు గెలిచారో తెలుస్తుందని పేర్కొన్నారు. అది బీజేపీ ఓటమి కాదని, మోదీ ఓటమి అని, ప్రతి దానికి మోదీ ముద్ర వేశారని, మోదీ గ్యారెం టీ అంటూ ప్రచారం చేశారని విమర్శించా రు. మోదీ గ్యారెంటీకి వారెంటీ పూర్తయిందని ఎన్నికలకు ముందే చెప్పినట్టు సీఎం గుర్తుచేశారు.

బీహార్ సీఎం నితీశ్‌కుమార్, ఏపీ సీఎం చంద్రబాబు సహకారంతోనే కేంద్రంలో బీజేపీ నడుస్తోందన్నారు. భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ పార్టీ లబ్ధి పొందు తున్నదని, ఎన్నికల ముందు పుల్వామా, ఆయోధ్య రామమందిరం.. ఇలా ఎదో ఒక అంశాన్ని తీసుకుని బీజేపీ భావోద్వేగ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.  

మా పార్టీది జాతీయ దృక్ఫథం 

కాంగ్రెస్ పార్టీ జాతీయ దృక్ఫథంతో ఉంటుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉందని, రాహుల్‌గాంధీ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. 2014 నుంచి 2024 వరకు వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయినా రాహుల్‌గాంధీ మైదానాన్ని వీడలేదని చెప్పారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు.. 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని వెల్లడించారు.

మణిపూర్‌లో అల్లర్లు జరిగితే మణిపూర్ నుంచి ముంబై వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. దేశంలో పవర్ పాలిటిక్స్‌కు గాంధీ కుటుంబం దూరంగా ఉంటుందని చెప్పారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత ఆ కుటుంబం నుం చి ఎవరైనా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కనీ సం కేంద్ర మంత్రి అయ్యారా? అని ప్రశ్నించారు.

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, జవహర్‌లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ పదేళ్లకు పైగా జైలు జీవితం గడిపారని గుర్తుచేశారు. సోని యా, రాహుల్‌గాంధీకి ప్రధాని అవకాశం వచ్చినా తీసుకోలేదని చెప్పారు.

దేశంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయని, ఇందిరాగాంధీ మనువడు రాహుల్ గాంధీకి సొంత ఇళ్లు లేదని తెలిపారు. కాంగ్రె స్ పార్టీ ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం ఏటీఎంగా మారాయని మోదీ అనడం హోదాను తగ్గించుకోవడమేనని అన్నారు.  సొంత ఇళ్లు, వాహనాలే లేనప్పుడు వాళ్లకు పైసలు ఎందుకు? అని అన్నారు. 

దేశంలో స్విగ్గీ రాజకీయాలు  

గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసి నా కాంగ్రెస్‌ను ఎందుకు ఆదరించడం లేద న్న ప్రశ్నకు రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘ఇప్పుడు స్విగ్గీ రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో అమ్మమ్మ, నానమ్మలు వంట చేసే వరకు వేచి ఉండేవాళ్లం. లేదంటే హోటల్‌కు వెళ్లేవాళ్లం.  ఇప్పుడు స్విగ్గిలో ఆర్డర్ చేస్తే రెం డు నిమిషాల్లో ఆర్డర్ వస్తోంది. రాజకీయాల్లోనూ అదే నడుస్తోంది. సరళీకరణ తర్వాత సిద్ధాంతపరమైన రాజకీయాలు, ఆలోచనలు తగిపోయినాయి.

ఎంత త్వరగా సంపాదించాలనే ఆలోచిస్తున్నారు’ అని సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో ప్రతీ ఒక్కరికి అంకితభావం పెరిగేలా చూడాలని, అందుకు రీ ఓరియెంటేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో సిద్ధాంత పరమైన రాజకీయాలా? స్విగ్గీ రాజకీయా లా? కూటమి ప్రభుత్వాలా? తాత్కాలిక ఉపశమనం కోసం ప్రయత్నిస్తే.. దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కవు ’ అని చెప్పారు.  

నేడు మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం 

మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగం గా సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం  ప్రచారం చేయనున్నారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. 

అందరికీ సమాన అవకాశాలే తెలంగాణ మాడల్ 

ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడమే తెలంగాణ మాడల్ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్ల కేసీఆ ర్ పాలనలో ౧౦సార్లు కూడా సచివాలయానికి రాలేదని, ఇప్పుడు ప్రతి పక్ష నాయకుడిగా ఉండీ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. తాను ప్రతి రోజు సచివాలయానికి వెళ్తున్నానని స్పష్టంచేశారు.

2004 నుంచి 2014 వరకు కేం ద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పు డు మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నారని.. ఆయన గుజరాత్ మాడల్‌ను ప్రచారం చేసుకున్నా.. కేంద్రం ఎలాంటి ఆటంకం కలిగించలేదని చెప్పారు. ప్రస్తుతం ప్రధా ని మోదీ.. ప్రతిపక్ష పార్టీలపాలిత రాష్ట్రాలను విస్మరించడం, ప్రభుత్వాలను కూల్చడం చేస్తున్నారని మండిపడ్డారు.  

ప్రభుత్వాలను కూల్చడమే గుజరాత్ మాడల్ అని, తెలంగాణలో ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నిస్తే గుజరాత్‌కు వెళ్లమని పీఎం కార్యాలయమే చెప్తోందని ఆరోపిచారు. సెమీ కండక్టర్‌కు చెందిన ఇన్‌సెంటివ్స్ ఎవరికి ఇచ్చారు? అయిదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర లేకుండా సాధ్యమవుతుం దా? అని ప్రశ్నించారు.

మహారాష్ట్ర నుం చి 17 భారీ పెట్టుబడులను గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు. ప్రధాని జడ్జిలా ఉండాలని, ఒకరి తరఫున వకల్తా పుచ్చుకోకూడదని సూచించారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాలకు మోదీ మద్దతిస్తే ప్రతి రాష్ట్రం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించగలదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. 

కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశా.. చంద్రబాబుతో పని చేశా 

చంద్రబాబు, కేసీఆర్‌తో కలిసి పని చేశారన్న ప్రశ్నకు రేవంత్‌రెడ్డి స్పంది స్తూ.. తానెప్పుడు టీఆర్‌ఎస్‌లో పని చేయలేదని రేవంత్ అన్నారు.  తెలంగాణ ఉద్యమం సమయంలో కేసీఆర్‌కు ఫైనాన్స్ చేశానని చెప్పారు. టీడీపీలో ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పని చేశానని తెలిపారు.

తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో విద్యార్థులు, పారిశ్రామిక వేత్తలు ఉద్యమానికి మద్ద తు ఇచ్చారని, దానిని వారు పెట్టుబడిగా మార్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపై స్పందిస్తూ.. ప్రతీ నేత కుర్చీ కోసం ఆలోచన చేస్తారని, కుర్చీ కోసం విభజన రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడు విభజన రాజకీయాల గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు.

ఎంత మంచి ఔషధానికైనా ఎక్స్‌పైరీడేట్ ఉంటుందని, విభజన రాజకీయాలకు కూడా గడువు ముగిసిందని చెప్పారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల ను విస్మరిస్తే.. ప్రజలు రాజకీయ పార్టీ లు, నాయకులను విస్మరిస్తారని పేర్కొన్నారు. కొత్త తరం వారికి త్వరగా కుర్చీ లో కూర్చోవాలనే తాపత్రయం ఉండటంతో లెక్కలు మారుతాయన్నారు.