రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్ల, డిసెంబర్ 31( విజయ క్రాంతి): గొలుసు కట్టు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కు పాల్పడితే కఠిన చర్య లు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజ న్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. వేములవాడ పట్టణ పరిధిలోని షాభాష్ పల్లి ఆర్ అండ్ ఆర్ కాలని కి చెందిన పండుగ నరేష్ కుమార్, నాంపల్లి కి చెందిన రేగుల బలరాం మాయమాటలు నమ్మి ఎస్ ఎస్ ఎకో మోటార్స్ మేనేజ్మెంట్ ప్రవేశపెట్టినటువంటి గొలుసు కట్టు పద్ధతి ద్వారా ఎలక్ట్రిక్ బైక్ కొనడానికి నిర్ణయించుకున్నాడని అన్నారు.
రూ.21 వేలు కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అయి, మరలా అతడు మరో ముగ్గురిని ఈ స్కీములో జాయిన్ చేస్తేనే అతనికి ఎలక్ట్రిక్ బైక్ ఇస్తారని నమ్మబలికారాని తెలిపారు. మిగతా ముగ్గురిని జాయిన్ చేయించలేక తన డబ్బులు తిరిగి పొందలేక మోసపోయానని, గ్రహించిన నరేష్ పోలీసులను ఆశ్రయించాడని అన్నారు.
వేములవాడ టౌన్ పోలీస్ రేగుల బలరాం, ఎస్‌ఎస్ ఎకో మోటార్స్ యాజమాన్యంపై కేసు నమోదు చేసి మంగళ వారం రేగుల బలరామును రిమాండ్‌కు తరలించారని అన్నారు.
అనుమతులు లేకుండా చేసే చట్ట వ్యతిరేక గొలుసు కొట్టు స్కీమ్స్ నిషేధించడం జరిగిందని, ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేకమైనా కార్యక్రమాలకు పాల్పడితే కేసులు పెట్టడం జరుగుతుం దన్నారు. ఇంకా ఎవరైనా ఎస్ ఎస్ ఎకో మోటార్స్ యాజమాన్యం ద్వారా మోసపోయిన వారు ఎవరైనా ఉంటే దగ్గర్లో ఉన్న పోలీసులను సంప్రదించాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.