06-03-2025 06:58:46 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో విద్యుత్ శాఖ వినియోగదారులు మీటర్ రీడింగ్ లో అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాన్స్కో విజిలెన్స్ సిఐ ప్రభాకర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొందరు 200 ఉచిత కరెంటు వినియోగించుకునేందుకు మీటర్ రీడింగ్ 200 యూనిట్లు దాటకుండా టెక్నికల్ సాయంతో మీటర్ రీడింగ్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమ తనిఖీలు వెల్లాడైందని వివరించారు.
మీటర్ రీడింగ్ లో ఎక్కువ మీటర్ తిరగకుండా ఎవరు సాంకేతిక సాయం వైర్లు పెట్టిన వారిపై క్రిమినల్ కేసులను బుక్ చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో వీరిని గుర్తించేందుకు పోలీస్ శాఖ సహకారంతో చర్యలు చేపట్టడం జరిగిందని గృహ వినియోగదారులు కూడా ఎవరి మాటలకు నమ్మి తమ కుటుంబంపై కేసులు పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది దేవిదాస్ రోహిదాస్ గోపి పాల్గొన్నారు.