01-03-2025 12:15:23 AM
నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందిని హెచ్చరించారు. నార్కెట్పల్లి మండలంలోని అక్కనపల్లి పీహెచ్సీని శుక్రవారం ఆమె తనిఖీ చేసి సిబ్బంది హాజరు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. పీహెచ్సీ వైద్యాధికారి వరూధిని అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు నిర్ధారించుకున్నారు. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
అనంతరం చిన్ననారాయణపురంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలను కలెక్టర్ తనిఖీ చేసి కిచెన్, స్టోర్రూమ్, వంట సరుకులు, కూరగాయలు, పప్పు దినుసులు పరిశీలించారు. వంటగది శుభ్రంగా లేకపోవడంతో ప్రిన్సిప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు చాక్లెట్లు పంపిణీ చేశారు. హాస్టల్కు పక్కా భవనం మంజూరు చేయాలని ప్రిన్సిపాల్, సిబ్బంది కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.