calender_icon.png 19 April, 2025 | 4:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

11-04-2025 12:00:00 AM

ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ 

ఎల్బీనగర్, ఏప్రిల్ 10 : ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. హనుమాన్ జయంతి ర్యాలీ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సుంచించారు. ఈ నెల 12న  నిర్వహించనున్న హనుమాన్ జయం తి సన్నాహక సమావేశం గురువారం  కర్మన్ ఘాట్ లోని లక్ష్మి కన్వెన్షన్ లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీ నాయకులు, ఎల్బీనగర్ డీసీపీ జోన్ పరిధిలోని సీఐలు, ఎస్త్స్రలు పాల్గొన్నారు. సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. హనుమాన్ జయంతి ర్యాలీ రోజు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కూడా ఉండడంతో సిబ్బంది అక్కడికి కూడా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి నిర్వాహకులు ఎలాంటి సంఘటనలు జరగకుండా కొంతమంది వలంటీర్లను నియమిం చుకోవాలని సూచిచారు.

ర్యాలీ సమయంలో రోడ్డు మొత్తం వెళ్లకుండా ఒక సైడ్ గా వెళ్లాలని, ర్యాలీలో  భారీగా శబ్దాలు వచ్చే వాహనాలను వాడవద్దన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

ర్యాలీ పూర్తయిన తర్వాత యువకులు తిరిగి వేగంగా ఇంటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని, దీంతో ప్రమాదల భారిన పడే అవకాశాలు ఉన్నాయని, వారిని ముందుగానే హెచ్చరించాలని కోరారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ గుప్తా, ఉత్సవాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.