calender_icon.png 2 April, 2025 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

29-03-2025 12:55:28 AM

- జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ 

చేవెళ్ల , మార్చి 28 : గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్లపై నిర్లక్ష్యం హించిన అధికారులు, జీపీ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్ హెచ్చరించారు. శుక్రవారం శంకర్పల్లి మండల పరిధి మోకిలాలో పర్యటించారు.

మోకిలాలోని లా పలోమా విల్లాస్ నిర్వాహకులు రూ.12 వేల 100 రూపాయల ఆస్తి పన్నుకు సంబంధించిన చెక్కును డీపీవో సమక్షంలో ఎంపీడీవో వెంకయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా డీపీవో సురేశ్ మోహన్ మాట్లాడుతూ.. అధికారులు 100 శాతం పన్ను వసూళు చేయాలని, ఈ రెండు రోజుల్లో ప్రజలు సహకరించి విధిగా ట్యాక్స్‌లు పే చేయాలన్నారు.

పన్నులు చెల్లించని యజమానులకు జప్తు నోటీసులు జారీ చేయాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి ప్లాస్టిక్ నిర్మూళనకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని ప్రజలకు తెలిపారు. డీపీవో వెంట శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్యగౌడ్, ఎంపీవో గిరిరాజ్, మోకిలా పంచాయతీ కార్యదర్శి ఎల్లయ్య ఉన్నారు.