డీపీవో శ్రీనివాస్
భైంసా, నవంబర్ 30: సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భో జనం మెనూ ప్రకారం నాణ్యతగా ఉండేలా చూడాలని డీపీవో శ్రీనివాస్ అధికారులకు సూచించారు. కుంటాలలో శనివారం సంక్షేమ వస తి గృహాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహిం చారు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, వసతిగృహాల్లో విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజాగా వండి వడ్డించాలన్నారు. ఆహార భద్రత కమిటీలను నియమించాలన్నారు. భోజనం వండిన తరువాత సంబంధిత అధికారులు, ప్రధానోపాధ్యా యులు మొదటగా తిన్న తర్వాతనే విద్యార్థులకు వడ్డించాలన్నారు. ఏ లోపం జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో తహసీల్దార్ ఎజాజ్‌అహ్మద్, ఎంపీడీవో లింబాద్రి, ఎంఈవో ముత్యం, ఎంపీఈవో రహీం పాల్గొన్నారు.