నిర్మల్ (విజయక్రాంతి): బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకుంటే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని బాలల సంరక్షణ సమితి చైర్మన్ వహీద్ ఖాన్ అన్నారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని వివిధ వ్యాపార దుకాణాలను పరిశ్రమలను తనిఖీ చేసి ఆపరేషన్ లో భాగంగా అవగాహన కల్పించారు. 14 సంవత్సరలోపు పిల్లలకు పని నుండి విముక్తి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సమితి అధికారులు అనిల్ సుందర్, శ్రీనివాస్, శ్రీలత, వజ్రమ్మ పాల్గొన్నారు.