19-03-2025 12:41:20 AM
అవకతవకలపై ఫిర్యాదు చేయాలి: కమిషనర్ ఏవి రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 18(విజయక్రాంతి) : హైడ్రా పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. ఎమ్మెల్యేల ఫిర్యాదులపైనే స్పందన కరువా అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపణలు చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో ఆయన ప్రకటనను విడుదల చేశారు.
అవకతవకలు జరిగినట్లు ఆధారాలుంటే వెంటనే తనదృష్టికి తీసుకురావాలని, ఏసీబీ, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, స్థానిక పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆరోపణలు నిజమైతే వెంటనే సస్పెండ్ చేస్తామ ని, చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రత్యక్షంగా, పరోక్షంగా హైడ్రా పే రిట అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయ ని, ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కాగా ఇప్పటి వరకు హైడ్రాకు 9800ఫిర్యాదులు అందాయని వీటిలో చాలా వరకు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.