14-02-2025 12:00:00 AM
వైరా ఏసీపీ రహెమాన్
ఖమ్మం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూ రిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు, ఇతరు ల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ర్పచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రహెమాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాజకీయ, కుల, మత, ప్రాంతీ య వివాదాలకు తావు ఇచ్చేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లయితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించా రు.
ఇలాంటి చర్యలను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. సామాజిక మాధ్య మాలను సమాజానికి మంచిని చేకూర్చే విధంగా మాత్రమే ఉపయోగించుకోవాల ని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని సూచించారు.