13-02-2025 12:00:00 AM
వెల్దుర్తి, ఫిబ్రవరి 12 : హల్దీ వాగు నుండి అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తూప్రాన్ సీఐ రంగాకృష్ణ హెచ్చరించారు. మంగళవారం రాత్రి హల్దీ వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు సీఐ రంగాకృష్ణ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా హల్దీ వాగు నుండి ఇసుక రవాణా చేసినట్లయితే అట్టి వాహనాలను సీజ్ చేసి సంబంధిత వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరుగుతుందని సిఐ రంగాకృష్ణ హెచ్చరించారు.