calender_icon.png 21 February, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్య లేకుండా చర్యలు

19-02-2025 12:25:06 AM

  1. ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారీ
  2. జైనూర్, కెరమెరి మండలాల్లో పర్యటన

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): విజయక్రాంతి దిన పత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘చెలిమె నీళ్లే గంగజలం!’ కథనానికి అధికారులు స్పందించారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపడుతున్న  ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. మంగళవారం జైనూర్ మం  దుబ్బగూడ, కెరమెరి మండలం సాకడ గ్రామపంచాయతీల్లో ఆయన పర్యంటించారు.

వేసవిలో తా  ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా తాగునీరు అందించాలని, వాటర్ ట్యాం  ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, పైప్ లైన్లకు మరమ్మతులు చేయాలని అధికారులను అదేశించారు. తాగునీటి సమస్యలు లేకుండా కార్యచరణ రూపొందించి నివేదికను అందించాలని ఆదేశించారు. ఆయనవెంట జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ ఉన్నారు.