ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): నగరంలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగనాథ్ పలు ప్రాంతాలను అధికారులతో కలిసి సందర్శించారు. వాటర్ లాగింగ్ పాయింట్లతో పాటు క్యాచ్‌పిట్స్, మ్యాన్ హోల్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లోత ట్టు ప్రాంతాలు, రోడ్లపై వరద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదకరమైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలతో పాటు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ప్రవాహంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.