calender_icon.png 26 December, 2024 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతు పరిరక్షణకు చర్యలు చేపట్టాలి

27-07-2024 02:08:58 AM

మీడియా సమావేశంలో పెట్ లవర్స్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 26 (విజయక్రాంతి): సమాజంలో గోమాతలను రక్షించినట్టుగానే యానిమల్స్ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు పెట్ లవర్స్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కుక్కల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై జీహెచ్‌ఎంసీ ప్రజలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో పలువురు గాయాల పాలవ్వడం, మరణించడం వంటి సంఘటనల నేపథ్యంలో కుక్క ల నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసించడంతో పాటు పెట్ లవర్స్ పై జరుగుతున్న దాడులను నివారించాలని కోరుతూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

సమావేశంలో యానిమల్ ఫీడింగ్ గ్రూప్, పెటా, సిటిజన్స్ ఫర్ యానిమల్స్, మణికొండ యానిమల్ రెస్క్యూ గ్రూప్, ఆసరా, తెలంగాణ పెట్ అడప్షన్ సంస్థల ప్రతినిధులు జైదీప్ కుమార్, సయ్యద్ రాణా, పృథ్వీ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్కూల్స్, సినిమా హాల్స్‌లో కుక్కల పట్ల అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని తెలి పారు.  నగరంలో మూగ జీవాలకు 24 గంటల పాటు వైద్య సదుపాయాలు కల్పించాలని, ప్రత్యేక అంబులెన్స్ సర్వీసులను ప్రవేశపెట్టాలని అన్నారు. కార్యక్రమంలో నవీన్ గురుకుల, రాధారెడ్డి, భాగ్యలక్ష్మి, ప్రసాద్, మణిమాల, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.