calender_icon.png 22 January, 2025 | 7:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ స్టేషన్ మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు

22-01-2025 04:34:04 PM

వినియోగదారులకు ఇబ్బందులు కలుగకుండా విద్యుత్ సరఫరా

ఎన్పిడిసిఎల్ డైరెక్టర్ అశోక్ కుమార్...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో గల సబ్ స్టేషన్ సాంకేతిక కారణాల వల్ల మంగళవారం దగ్ధమైన విషయం విధితమే. సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ఫార్మర్లు దగ్ధం కావడంతో కోటి రూపాయల నష్టం వాటిల్లింది. NPDCL సీఎండీ K. వరుణ్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. సబ్ స్టేషన్ లోని ట్రాన్స్ఫార్మర్లు దగ్ధమైన తీరును స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంపై అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. అంత అగ్నిప్రమాదం జరిగినా గంట 30 నిమిషలలో విద్యుత్ అన్ని ప్రాంతాలకు విద్యుత్ అధికారులు విద్యుత్తును పునరుద్దరించడంపై హర్షం వ్యక్తం చేసారు. 

కాలిపోయిన ట్రాన్స్ఫర్మర్ల వద్ద కొత్త ట్రాన్స్ఫార్మర్ లు CMD ఆదేశాలతో అలాట్ చేశామన్నారు. ఇకముందు ఇలాంటి ప్రమాదలు జరగకుండా సబ్ స్టేషన్ లో అధికారులకు పలు సూచనలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన, త్వరతగతిన మరమ్మత్తులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ డిఈఈ లు కళ్యాణ్ చక్రవర్తి, టెక్ ప్రభాకర్, డిఈఈ ఎంఆర్ టి నాగరాజు, సివిల్ ఈఈ స్వామి, ఏడి ఈ కిరణ్ ఏడి ఈ హెచ్ టి సతీష్, ఏడి ఈ ప్రొటెక్షన్ జైరాజ్, చంద్రకాంత్ రావు, రంజిత్, ప్రదీప్ కుమార్, హన్మంత్ రెడ్డి, శ్రీనివాస్, మనోరంజాన్ కార్తీక్, సిబ్బంది పాల్గొన్నారు.