నిర్మల్ (విజయక్రాంతి): టోల్ ప్లాజాలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను తొలగించకుండా చర్యలు తీసుకున్నట్టు కార్మిక శాఖ సహాయ కమిషనర్ ముత్యం రెడ్డి అన్నారు. మంగళవారం సిఐటియు టోల్ ప్లాజా కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కార్మిక శాఖ అధికారిని కలిసి సమస్యలు వివరించారు. ఎన్నో సంవత్సరాలుగా తాము విధులు నిర్వహిస్తున్నామని ఇప్పుడు తమను విధుల నుంచి తొలగించడం వల్ల ఇబ్బందికి గురవుతామని కార్మిక శాఖ అధికారికి కార్మికులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ కుమార్, గంగాధర్, రాజేశ్వర్, శ్రావణ్ కుమార్ తదితరులు ఉన్నారు.