సిద్దిపేట, నవంబర్ 5(విజయక్రాంతి) : సిద్దిపేటలో రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం చైతన్యపురి కాలనీలోని మట్టి రోడ్డును కొందరు ఆక్రమించి హద్దురాళ్లు ఏర్పాటు చేశారని వచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన కమిషనర్ సంఘటన స్థలాన్ని సందర్శించి సిబ్బందితో హద్దురాళ్లను తొలగించారు.