- ఆక్రమణకు గురైన 2 ఎకరాల భూమి అప్పగింత
- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల, డిసెంబర్ 30( విజయ క్రాంతి): ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఎంతటి వారి పైనైనా కఠిన చర్యలు తీసు కుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లాలో ఆక్రమణకు గురైన రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని లక్ష్మీపురం మాజీ సర్పం మిట్టపల్లి పద్మ తిరిగి ప్రభుత్వానికే అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు.
సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమి అప్పగింతపై ఎస్పీ అఖి ల్ మహాజన్‌తో కలిసి పాత్రికేయుల సమా వేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడు తూ.. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ మాజీ సర్పం మిట్టపల్లి పద్మ 2018 సంవత్సరంలో తాడూరు గ్రామ సర్వే నెంబర్ 545/1/1/3/1 లో గల 2 ఎకరాల భూమి ప్రభుత్వం తనకు కేటాయించిందని, 2 ఎకరాల భూమిని మాజీ సర్పం పద్మ ప్రభుత్వానికి తిరిగి అప్పగించడానికి నిర్ణ యించారని అన్నారు.
జిల్లాలో ఎవరైనా భూ ఆక్రమణలకు పాల్పడి ఉంటే సదురు భూ మిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించాలని, ఈ భూములను పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగి స్తామన్నారు.పేద ప్రజలకు ఇంటి పట్టాల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వినియోగిస్తామన్నారు.
2018 నుంచి 2023 వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉంటూ రైతు బంధు మొదలైన ప్రభుత్వ పథకాలు లబ్ది పొందినందుకు ఆ సొమ్ము రికవరి కోసం డిమాండ్ నోటీసు జారీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ భూముల ను ఆక్రమించిన, అక్రమాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదన్నారు.