calender_icon.png 25 November, 2024 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోళ్లలో జాప్యం జరిగితే చర్యలు

25-11-2024 08:23:04 PM

నిర్మల్ (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోళ్ళలో జాప్యం జరిగితే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. సోమవారం నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆకస్మీకంగా తనఖీ చేశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకొన్నారు. వరిధాన్యం తేమను పరిశీలన చేసిన కలెక్టర్ ట్యాబ్ ఎంట్రి వివరాలు పరిశీలన చేశారు కొన్న ధాన్యంను వెంట వెంటనే రైస్ మిల్లర్లకు తరలించాలని ధాన్యం డబ్బులు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో ఆక్రమాలు జరగకుండ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షన చేయాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, డిఎస్‌ఓ కిరణ్ కుమార్, అధికారులు ఉన్నారు.