మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు
జనగామ: దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని జనగామ మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. బుధవారం జనగామ పట్టణంలో మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలో అక్కడక్కడ చెత్తకుప్పలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పలు షాపులను తనిఖీ చేసి ప్లాస్టిక్ కవర్లు వినియోగించవద్దని సూచించారు. అనంతరం మహిళలకు రూ.500 గ్యాస్ కనెక్షన్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ మల్లిగారి మధు, ఆర్పీ భద్రమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.