calender_icon.png 17 January, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సినిమాలు ప్రదర్శిస్తే చర్యలు

17-01-2025 02:23:45 AM

  • బస్సులు, లోకల్ ఛానళ్లలో పైరసీ ప్రసారాలపైచర్యలు
  • టీజీఎఫ్‌డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు 

హైదరాబాద్, జనవరి 16:  ఎలాంటి అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు లోకల్ కేబుల్ ఛానల్స్‌లో ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలం  ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రజా రవాణా వాహనాలు, లోకల్ ఛానల్స్‌తోపాటు ఆన్లైన్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో ఎలాంటి అనుమతి లేకుండా చా  సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలు  ఫిలిం చాంబర్ దృష్టికి వచ్చిందని దిల్‌రాజు తెలిపారు.

ఇలా చేయడం వల్ల పైరసీ కాపీరైట్ కింద నేరంగా పరిగనిస్తామని స్పష్టం చేసారు. ప్రజలకు వినోదాన్ని అందించే లక్ష్యంతో నిర్మాతలు, డైరెక్టర్లు సినిమాలను రూపొం  కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెడుతుంటారని తెలిపారు.

అక్రమంగా సినిమాలను ప్రద  వల్ల సినీ పరిశ్రమ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు సృజనాత్మకత దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల ప్రదర్శన అనుమతుల కోసం మ్యాంగో, ఆదిత్య మూ  శ్రీ బాలాజీ వీడియోస్ మొదలైన ఆధీకృత సంస్థలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభు  తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటుంటుందని దిల్‌రాజు వెల్లడించారు.