రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 2: మైనర్లు వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆరంఘర్ చౌరస్తా, పిడిపి చౌరస్తా, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మైనర్లు పదిమంది వాహనాలు నడుపుతుండగా, అదేవిధంగా లైసెన్సు లేకుండా నడుపుతున్న 20 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు.