calender_icon.png 27 October, 2024 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఆస్తుల పరిరక్షణకు చర్యలు చేపట్టడం హర్షనీయం

27-10-2024 09:02:04 PM

మందమర్రి,(విజయక్రాంతి): ఏరియా పరిధిలోని రామకృష్ణాపూర్ లోని జయశంకర్ విగ్రహం సమీపంలోని కంపెనీ క్వార్టర్ పక్కన ఖాళీ స్థలాన్ని కబ్జా కాకుండా సింగరేణి యాజమాన్యం స్థలం చుట్టూ కంచె వేసి సంరక్షణ చర్యలు చేపట్టడం అభినందనీయం అని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకట స్వామి, కార్యదర్శి అల్లి రాజేందర్ లు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం రామకృష్ణాపూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

క్వార్టర్ ని అనుకుని ఉన్న కొంత స్థలంలో యూనియన్  జెండాను నిలపడం జరిగిందని కార్మిక వర్గం సంక్షేమం, వేతనాల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారానికి నిరంతరం తమ యూనియన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని దీనిని సింగరేణి, ఇతర రంగాల కార్మికులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు  గమనిస్తున్నారని అన్నారు. సిఐటియు ఆఫీస్ పక్కన ఉన్న స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసిన వ్యక్తులకు ప్రజానీకం అండగా లేకపోవడం సంతోషంగా ఉందని, సింగరేణి యాజమాన్యం వెంటనే చొరవ తీసుకొని సంస్థ ఆస్తుల సంరక్షణకు ఏరియా జిఎం,ఎస్టేట్ ఆఫీసర్, సెక్యూరిటీ అధికారులు ముందుండి సింగరేణి ఆస్తులను సంరక్షించారని అధికారులను వారు అభినందించారు.

సింగరేణిలో ఖాళీగా ఉన్న స్థలాలను కబ్జా కాకుండా కార్మిక వర్గానికి ఇచ్చే విధంగా యజమాన్యం ప్రయత్నాలు కొనసాగించాలని కోరారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చే విధంగా యూనియన్ ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి కాంటాక్ట్ కార్మికులకు, పదవి విరమణ పొందిన కార్మికులకు ఖాలి స్థలాలను ఇంటి నిర్మాణానికి కేటాయించి సొంతింటి కళ నెరవేర్చాలని దీని కోసం  ప్రతి కార్మికునికి 250 గజాలు స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. కబ్జా రాయుళ్లు తమ యూనియన్ మీద బురద చల్లి పక్క త్రోవ పట్టించే విధంగా ప్రయత్నాలు చేసిన వారికి ప్రజలు, కార్మికులు తగిన బుద్ధి చెప్తారని,తమ పోరాటం  కార్మికులు, ప్రజల సంక్షేమం కోసమే తప్ప మా స్వార్థం కోసం కాదని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు వద్లకొండ ఐలయ్య లు పాల్గొన్నారు.