calender_icon.png 26 October, 2024 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుంటే చర్యలు

10-08-2024 12:41:37 AM

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలో నివాస భవనాల మధ్య ప్రమాదకర వస్తువులను అనధికారికంగా నిల్వచేసే కార్యకలాపాలపై ఫిర్యాదులు చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. నగరంలో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాదిలో నగరంలో జరిగిన వివిధ అగ్నిప్రమాదాలకు సంబంధించిన కారణాలను ఆయన వెల్లడించారు.

పార్కింగ్‌కు స్థలం కేటాయించకపోవడం, సరైన గాలి వెలుతురు లేని అపార్ట్‌మెంట్ల నిర్మాణం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం తదితర వాటి వలన అగ్ని ప్రమాదాలు సంభవించినప్పడు సహాయక చర్యల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఓఆర్‌ఆర్ ప్రాంతంలోని నివాస భవనాల మధ్య ప్రమాదకర వస్తువులతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.

మీ ప్రాంతాల్లో ప్రమాదకర వస్తువులు ఉన్నట్లయితే హైదరాబాద్ డిజిస్టార్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) వాట్సాప్ నంబరు 90001 13667కు, టోల్ ఫ్రీ నంబరు 18005990099  లేదా 040 0596, 040 0593 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. commissinerhydraa@ gmail.com కు మెయిల్ కూడా చేయవచ్చన్నారు. కమిషనర్‌ను వ్యక్తిగతంగా కలవాలనుకునే వారు ముందుగా 72079 23085 నంబరుకు మెసేజ్ చేసి అపాయిమెంట్ పొందాలని సూచించారు. ప్రజలు చేసిన ఫిర్యాదులను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.