calender_icon.png 2 November, 2024 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

02-11-2024 02:04:35 AM

  1. యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు
  2. పలువురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

యాదాద్రి భువనగిరి, నవంబర్ 1 (విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులకు షోకాజ్ నోటీసులు అందజేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన శుక్రవారం ఉదయం ఆలేరు మండలంలో ఇంటింటి సర్వేను పరిశీలించారు.

అయితే ఈ కార్యక్రమాన్ని సమన్వ యం చేయాల్సిన జిల్లా అధికారి, మండల ప్రత్యేక అధికారి గోపాల్ విధులకు హాజరుకాకపోవడంపై ఆగ్రహించిన కలెక్టర్ అతడికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. అనంతరం ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి  సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధులకు డుమ్మా కొట్టిన ముగ్గురు వైద్యాధికారులు.. డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రజని, డాక్టర్ స్వప్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం గుండాల పీహెచ్‌సీని తనిఖీ చేసిన ఆయన విధులకు హాజరుకాని వైద్య సిబ్బంది పి.వెంకటేషం, కరుణ, వనజ కుమారికి నోటీసులు జారీ చేశారు.

తదనంతరం గుండాల పీఏసీఎస్ ధాన్యం కొనుగో లు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్.. రైతుల ధాన్యం తేమ పరీక్షకు వినియోగించే మాశ్చరైజ్ మిషన్, ప్యాడీ క్లీనర్‌తో పాటు కొనుగోలు కేంద్రంలో మౌలిక వసతులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఏసీఎస్ సీఈవో నాగయ్య, వ్యవసా యాధికారి క్రాంతికుమార్‌కు  షోకాజ్ నోటీసులు జారీ చేశారు.