calender_icon.png 23 September, 2024 | 9:59 AM

విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు

20-09-2024 12:00:00 AM

  1. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
  2. గరిడేపల్లి ప్రత్యేకాధికారి, ఎంపీవో, కార్యదర్శులకు షోకాజ్ నోటీస్ 

సూర్యాపేట, సెప్టెంబర్ 19 : విధులు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ పంచాయితీ కార్యాలయాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాల యంలో భూ సంబంధ సమస్యలపై వస్తున్న దరఖాస్తులను, వాటి పరిష్కారాలను తహసీల్దార్ కవితను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ డీఓ కార్యాలయంలో జరుగుతున్న ఓటర్ జాబితాలో అభ్యంతరాలు, మార్పులు, చే ర్పులు తదితర అంశాలపై వివిధ పార్టీల ప్ర తినిధులతో నిర్వహిస్తున్న మండల స్థాయి స మావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13న ప్ర చురించబడిన ముసాయిదా ఓటర్ జాబితాపై అభ్యంతరాలు ఉంటే దరఖాస్తులు అందజేయాలన్నా రు. 28న ఓటర్ జాబితాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించాలన్నారు. గరిడేపల్లి పంచాయితీ కార్యాలయంలో రికార్డు లు పరిశీలించారు. పన్నుల వసూళ్ల రికార్డు లు సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్య క్తం చేశారు. బాధ్యులైన ప్రత్యేకాధికారి సరో జ, ఎంపీవో మౌలానా, పంచాయితీ పాత, కొత్త కార్యదర్శులు నాగేశ్వర్‌రావు, సురేశ్‌లకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేసి పూ ర్తిస్థాయి విచారణ జరపాలని డీపీవోను ఆదేశించారు.