calender_icon.png 6 February, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు

06-02-2025 12:31:16 AM

 చేవెళ్ల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశం 

చేవెళ్ల , ఫిబ్రవరి 5 : డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం అన్నారు. బుధవారం శంకర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. 12 డైవింగ్ లైసెన్స్‌లు లేని వాహనాలు,

ముగ్గురు మైనర్లు డైవింగ్ చేస్తూ పట్టుబడ్డారు. దీంతో 15 వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పట్టుబడ్డవారికి సీఎం వెంకటేశం అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా  చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశం మాట్లాడుతూ.. వాహనాలు నడిపేవారు కచ్చితంగా లైసెన్స్‌లు కలిగిఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, ఇస్తే యజమానిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుందన్నారు.

హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.