calender_icon.png 3 February, 2025 | 8:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వివాహం చేస్తే చర్యలు తప్పవు

03-02-2025 05:23:13 PM

బాలల సంరక్షణ జిల్లా అధికారి బూర్ల మహేష్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మైనర్లకు వివాహం చేస్తే చర్యలు తప్పవని బాలల సంరక్షణ జిల్లా అధికారి బూర్ల మహేష్ హెచ్చరించారు. సోమవారం జిల్లాలోని రెబ్బెన మండలం పంకులం గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయి చింతల మాల పెళ్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన అబ్బాయితో వివాహ నిశ్చితార్థం జరుగుతున్నట్లు వచ్చిన పక్కా సమాచారం మేరకు బాలల సంరక్షణ అధికారి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ వంకులం గ్రామానికి వెళ్లి బాల్య వివాహం వల్ల ఎదురయ్యే ఆరోగ్య మానసిక సమస్యలు వివరించడంతో పాటు బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం వివాహం జరిగితే చట్టరీత్యా తీసుకునే చర్యలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా బూర్ల మహేష్ మాట్లాడుతూ.. బాల్యవివాహాల నిర్మూలనకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు. బాల్య వివాహం జరిపితే ఇది కుటుంబ సభ్యులకు పెద్దలకు పురోహితులకు పెళ్లి కుమారుడికి రెండు సంవత్సరాల నాన్ బేయిలెబుల్ జైలు శిక్ష, లక్ష రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాల వరకు అమ్మాయికి వివాహం జరిపించవద్దని సూచించడంతో ఇరు కుటుంబాలు సమ్మతించి నిశ్చితార్థాన్ని విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ రవళి, కానిస్టేబుల్ మల్లేశ్వరి, అంగన్వాడి టీచర్ లత తదితరులు పాల్గొన్నారు.