calender_icon.png 17 November, 2024 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకరించని మిల్లర్లపై చర్యలు

17-11-2024 12:47:44 AM

  1. కేటాయించిన ధాన్యం వారంలో తీసుకెళ్లాలి 
  2. 15రోజుల్లో సీఎంఆర్ అప్పగించాలి
  3. కల్లాల వద్దకు వెళ్లి సన్నాలు కొనొద్దు 
  4. అవసరమైతే పక్క రాష్ట్రాలకు అప్పగిస్తాం
  5. జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ 

హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాం తి) : ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోగా అందుకు మిల్లర్లు మాత్రం సహకరించడం లేదు. తేమ 17 శాతానికిపైగా ఉంటే సీఎంఆర్ చేశాక క్వింటా కు 67 కిలోల రైస్ ఇవ్వలేమని తెగేసి చెప్తున్నారు. బ్యాంక్ గ్యారంటీలు నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

కొనుగోలు చేసిన వడ్లను మిల్ల ర్లు తీసుకెళ్లకపోవడంతో తర్వాత వచ్చిన ధాన్యం పోసేందుకు స్థలం కొరత ఏర్పడుతున్నది. కొన్నిచోట్ల ధాన్యాన్ని గోదాంలకు తరలించగా, మిల్లర్లు ఒప్పందం చేసుకున్న కేంద్రాల్లోనే ధాన్ంయ నిలిచిపోయింది. అక్కడ  రైతులు ధర్నా చేస్తూ త్వరగా సన్నవడ్లు తూకం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్రాల నిర్వహకులు తేమ శాతం, తాలు పేరుతో కాలయాపన చేస్తున్నందున రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో సన్నాలు అమ్మేందుకు మొగ్గు చూపడం లేదు. అయితే మిల్లర్లు, నిర్వాహకులు కుమ్మక్కై కొనుగోలు చేయకుండా కుట్రలు చేస్తున్నారనే విమర్శలు విని పిస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 7,234 కేంద్రా ల ద్వారా 91లక్షల మెట్రిక్ టన్నుల సన్నవ డ్లు కొనుగోలు చేసి.. డిసెంబర్‌లోగా సీఎంఆర్ చేయించి జనవరిలో రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది.

కానీ కిందిస్థాయి అధికారు ల నిర్లక్ష్యం వల్ల సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి కావడం అసాధ్యమని స్పష్టమవుతున్నది. ఇప్పటివరకు 10.28లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు కొనుగోలు చేయగా రూ. 50 కోట్ల వరకు బోనస్ చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. 

వారంలో ధాన్యం తీసుకెళ్లాలి

మిల్లర్లు వారంలోగా తాము సూచించిన ప్రకారం బ్యాంకు గ్యారంటీ పత్రాలు ఇచ్చి, కేటాయించిన ధాన్యం తీసుకెళ్లి 15 రోజుల్లో సీఎంఆర్ చేసి అప్పగించాలని అధికారులు ఆదేశించారు. గడువులోగా సన్నవడ్లు తీసుకెళ్లకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరి స్తున్నారు.

గతంలో సీఎంఆర్ చేస్తే క్వింటాకు రూ.20 ఉండగా.. మిల్లర్ల డిమాండ్ మేరకు ప్రస్తుతం రూ.40కి పెంచామని, క్వింటాకు 67 కిలోల విషయంలో మొండి వైఖరి వీడాలని సూచిస్తున్నారు. నెల రోజులుగా పలు మార్లు సమావేశాలు జరిపినా మిల్లర్లు దిగిరాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవ హరించవద్దని వారు కోరుతున్నారు. సన్నధాన్యం నిల్వలు ఎక్కడ అక్రమంగా ఉన్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరిస్తున్నారు. 

పక్క రాష్ట్రాల మిల్లర్లకు ఇస్తాం

గడువులోగా వడ్లు తీసుకొని సీఎంఆర్ చేయకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూ స్తామని.. అవసరమైతే పక్క రాష్ట్రాల మిల్లర్ల కు అప్పగిస్తామని అధికారులు తేల్చి చెబుతున్నారు. గతంలో ధాన్యం తీసుకొని ఏళ్లు గడి చినా తిరిగి ఇవ్వకుండా కోట్లు కూడబెట్టుకున్నారని, ఇప్పుడు అలాగే చేస్తామంటే కుదరదని జిల్లా పౌరసరఫరాల అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. 

కుట్రలు చేస్తే సహించం..

కొందరు మిల్లర్లు దళారులను ఏర్పా టు చేసుకొని కల్లాల వద్దనే రైతుల నుంచి తక్కువ ధరకు సన్నాలను కొంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వెళ్లకుండా రైతులకు అడ్డుపడితే సహించ మని అధికారులు హెచ్చరిస్తున్నారు. సన్నాలకు ప్రభుత్వం బోనస్ ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేయవద్దని సూచిస్తున్నారు.