బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): ప్రజలను మోసం చేసి విదేశాలకు పంపిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీసులకు సూచించారు. శుక్రవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి ప్రారంభించారు.
గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న షేక్ హుస్సేన్ కుటుంబం నుంచి వచ్చిన మొదటి అభ్యర్థనను మంత్రి పొన్నం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో ప్రమాదంలో చనిపో యిన వారికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి ఇప్పటికే జీవో జారీ చేశామన్నారు.
గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వుజరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, ప్రజావాణికి ఒక్కరోజే 365 దరఖాస్తులు అందాయి. ఇందులో రెవెన్యూ 105, విద్యుత్ 58, ఎస్సీ సంక్షేమం 42, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి 29తో పాటు ఇతర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.