calender_icon.png 23 October, 2024 | 5:04 AM

పీఏసీఎస్ సీఈవోలపై చర్యలు!

07-08-2024 01:26:58 AM

రుణమాఫీ అక్రమాలపై సహకార శాఖ నజర్

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): రుణమాఫీకి సంబంధించి అక్రమాలకు పాల్పడిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలపై క్రమశిక్షణ చర్యలకు సహకార శాఖ సిద్ధమైంది. వాణిజ్య బ్యాంకుల ఆర్థిక సహాయంలో నడుస్తున్న 11 పీఏసీఎస్‌లు, డీసీసీబీ ఆర్థిక సహాయంతో నడుస్తున్న 5 పీఏసీఎస్‌ల కార్యదర్శలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు మంగళవారం తెలిపింది.

13 సంఘాల కార్యదర్శులపై క్రమశిక్షణ చర్యలతో పాటు, 92 సంఘాల కార్యదర్శుల నుంచి సంజాయిషీ కోరింది. అర్హులైన రైతులను రుణమాఫీ జాబితాలో చేర్చకుండా, అన ర్హులకు చోటు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. రుణమాఫీ మార్గద ర్శకాల ప్రకారం 12 డిసెంబర్, 2018 నుంచి 9 డిసెంబర్, 2023 మధ్యకాలంలో రైతులు రుణాలు పొంది, వాటిని రెన్యూవల్ చేయించి ఉంటేనే రుణమాఫీ వర్తిస్తుంది.

౧౬ పీఏసీఎస్‌లు ఈ నిబంధనలు పాటించ కుం డా జాబితాలు ప్రభుత్వానికి పంపిన ట్టు గుర్తించారు. 105 ప్రాథమిక సహకారం సంఘాల కార్యదర్శు లు అస లు, వడ్డీలు తప్పుగా లెక్కించి అసంబద్ధమైన సమాచారం ప్రభుత్వానికి పంపినందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఇలాంటి అక్రమా లు భవిష్యత్తులో జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సంఘాల కార్య దర్శులను రిజిస్ట్రార్ ఆదేశించారు.