calender_icon.png 27 October, 2024 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందులు అమ్మిన వారిపై చర్యలు

27-10-2024 12:06:58 AM

  1. జేడీ డాక్టర్ హేమలత హెచ్చరిక
  2. కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో విచారణ

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ ఈఎస్‌ఐ ఆసుపత్రికి సంబంధించిన మందులను కరీంనగర్‌లోని ఓ  ప్రైవేటు దవాఖానలో విక్రయిస్తుండగా పట్టుబడ్డ నేపథ్యంలో శనివారం వరంగల్ జాయింట్ డైరక్టర్ డాక్టర్ హేమలత విచారణ చేపట్టారు. శనివారం ఈఎస్‌ఐ హాస్పిటల్‌కు వచ్చిన ఆమె.. మందుల నిల్వ, వినియోగం, రికార్డులు తదితర ఆంశాలను పరిశీలించారు.

నివేదికను ఉన్నతాధికారులకు నివేదిక అందజేనున్నట్టు తెలిపారు. కాలం చెల్లిన లక్షల రూపాలయ విలువ చేసే మందులు పాడుబడ్డ భవనంలో నిల్వ చేసి ఉండటంతో జెడీనీ పలువురు జర్నలిస్టులు ప్రశ్నించగా, అవీ తమకు సంబంధించినవి కావని చెప్పడం అనుమానాలకు తావిస్తున్నది. లక్షల విలువ చేసే మందులను వినియోగించకుండా వృథా చేశారని ఆరోపణలు వస్తున్నారు.