calender_icon.png 20 November, 2024 | 9:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అధికారులపై చర్యలు

20-11-2024 01:23:39 AM

  1. హైడ్రా కమిషనర్ రంగనాథ్
  2. సంగారెడ్డిలోని అమీన్‌పూర్ చెరువు పరిశీలన

సంగారెడ్డి, నవంబర్ 19 (విజయక్రాంతి): చెరువుల ఆక్రమణకు సహకరించిన అధికారులపై ప్రభుత్వానికి నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ పెద్ద చెరువును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు.

అనంతరం అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు అలుగు, తూములు మూసివేయడంతో  ఎఫ్‌టీఎల్ పరిధి పెరిగిందని స్థా నికులు రంగనాథ్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై టెక్నికల్ టీంతో సర్వేచేయించి నివేదిక ఆధారంగా తదుపరి చర్య లు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

అలాగే పద్మావతి లేఔవుట్ పై ఫిర్యాదులు అందాయని ఈవిషయమై విచారణ చేపడతామ న్నారు. కొందరు స్థానిక రాజకీయ నాయకులు.. అధికారుల సహాయంతో ము న్సిపల్ పరిధిలోని పార్కులు, రోడ్లు, కబ్జా చేశారని స్థానికులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.  అమీన్ పూర్ పెద్ద చెరువు పరిధిలో అక్రమ నిర్మాణాలకు నోటీసులిచ్చి కూల్చివేస్తామన్నారు.