07-04-2025 05:31:43 PM
ఎంఈఓ హెలెన్ డారతి..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు నడిపితే చర్యలు తప్పవు అని ఎంఈఓ హెలెన్ డారతి(MEO Helen Darathi) అన్నారు. సోమవారం పట్టణంలోని బ్రిలియంట్ మోడల్ హై స్కూల్ ను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని సమాచారంతో స్థానిక ఎంఈఓ హెలెన్ డారతి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ హెలెన్ డారతి మాట్లాడుతూ.. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు.
కానీ పట్టణంలోని బ్రిలియంట్ మోడల్ హై స్కూల్ ప్రైవేటు పాఠశాల యజమాన్యం జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులకు విరుద్ధంగా యధావిధిగా విద్యార్థులకు రెండు పూటల బడిని నిర్వహిస్తున్నారని సమాచారంతో పాఠశాలను తనిఖీ చేసి సిబ్బందిని హెచ్చరించారు. ఇలాంటివి పునరావృతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఏ పాఠశాల నడుస్తున్న చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందిని పాఠశాల యాజమాన్యాలను హెచ్చరించారు.