25 May, 2026 | 1:17 AM

తరుగు పేరిట కోతలు విధిస్తే చర్యలు

25-05-2026 12:28 AM

నిర్మల్ మే 24 (విజయక్రాంతి): పంట కొనుగోలులో రైతులకు నష్టం కలిగించే తరుగు పేరుతో కోతలు విధిస్తే చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. పంట కొంగులపై ఆదివారం రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన అనంతరం మాట్లాడారు.

జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంట కొనుగోలు వేగంగా పూర్తి చేసినందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన చో ట స్థానిక హమాలీలను నియమించుకోవాలని, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. తాలు, తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళా వారోత్సవాలను జయప్రదం చేద్దాం

అదేవిధంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 30 వరకు నిర్వహించే మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ‘మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికా రులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్ భవేశ్ మిశ్రా అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో మరింత వేగం పెంచాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా కొనుగోళ్లు పూర్తి చేసి, రోజువారీ లక్ష్యాలను సాధించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.మహిళా వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని, ప్రతిరోజూ కార్యక్రమాలను మహిళలు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, డీఎం మార్క్ఫెడ్ మహేష్, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, డీఆర్డీఓ విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ అధికారి వినూత్న, హార్టికల్చర్ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు.