calender_icon.png 11 January, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా విక్రయించినా, వినియోగించినా చర్యలు తప్పవు: ఎస్పీ

11-01-2025 12:50:21 AM

వనపర్తి, జనవరి 10 ( విజయక్రాంతి ) :  వనపర్తి జిల్లా పరిధిలో చైనా మాంజ పై నిషేధం విధించడం జరిగిందని, జిల్లాలో ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్  శుక్రవారం ఒక ప్రకటనతో తెలిపారు.

రాబోయే సంక్రాంతి పండగ సందర్భంగా చైనా మాంజ ఎక్కువగా విక్రయించే దుకాణాల పై అధికారులు తనిఖీ లు నిర్వహించడం జరుగుతుందని,  నెలాన్, సింథటిక్ దారాలతో తయారు చేసే ఈ చెనా మాంజాలతో పర్యవరణానికి విపత్తుగా మారడంతో పాటు   చైనా మాంజ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ,   చెనా మాంజా విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. 

చైనా  మాంజా పై రాష్ర్ట ప్రభుత్వం నిషేధం విధించిందని పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా కూడా ఉంటుందన్నారు. ఎవరైనా చెనా మాంజా విక్రయిస్తున్న, వినియోగిస్తున్న డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలనీ జిల్లా ఎస్పీ ప్రకటన ద్వారా ప్రజలకు సూచించారు.