03-04-2025 12:04:40 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని తాండూర్ సీఐ కుమారస్వామి(Tandur CI Kumaraswamy) హెచ్చరించారు. గురువారం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్జాపూర్ గ్రామంలో నకిలీ పత్తి విత్తనాల పై వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆయన అవగాహన ర్యాలీ నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల భూమి సారవంతం కోల్పోయి పంట దిగులు తగ్గుతుందని తెలిపారు.
కౌలు రైతులకు కూడా ఈ నకిలీ విత్తనాలను వాడడం వల్ల భూతారం దెబ్బతింటుందని చెప్పారు. నకిలీ విత్తనాలు వాడడం వల్ల పంట నష్టపోతే ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం అందదని తెలిపారు. గ్లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడడం వల్ల చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అవగాహన కల్పించారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. ఈ అవగాహన ర్యాలీలో కన్నెపల్లి ఎస్సై గంగారం తో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.