calender_icon.png 19 March, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు: ఎస్ఐ గంగారం

19-03-2025 06:23:48 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు అమ్మితే కఠినమైన చర్యలు తీసుకుంటామని కన్నెపల్లి ఎస్ఐ గంగారం తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో నకిలీ విత్తనాల వ్యాపారం నిర్వహించే పాత నేరస్తులైన పున్నపురెడ్డి చందు, పుట్ట అశోక్ ల ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కన్నెపల్లిలో నకిలీ విత్తనాల వాడకం వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నకిలీ విత్తనాలు వేసుకోవడం వల్ల భూమి సారవంతం తగ్గి పంట దిగుబడలు పూర్తిగా తగ్గుతాయని రైతులకు తెలిపారు. గ్లైపోసిట్ నకిలీ విత్తనాలు వాడడం వల్ల రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మడం గాని కొనడం గాని చేయవద్దని సూచించారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీలలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.