26-03-2025 04:56:18 PM
గిర్నూర్ లో పోలీసుల కార్డన్ సెర్చ్..
బజార్హత్నూర్ (విజయక్రాంతి): సరైన పత్రాలు లేక వాహనాలు నడిపితే చర్యలు తప్పవని బోథ్ సీఐ వెంకటేశ్వర రావు సూచించారు. బోథ్ సర్కిల్ పరిధిలోని బజార్హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామంలో బుధవారం సీఐ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గ్రామస్తుల వద్ద ఉన్న వివిధ వాహనాల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలు నడపొద్దని గ్రామస్తులకు సీఐ సూచించారు. పత్రాలు లేని వారు వెంటనే తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలను తీసుకోవాలని అన్నారు. వాహనాలకు తప్పుడు నంబర్ ప్లేట్లను బిగించి వాహనాలు నడిపితే చట్టరీత్య చర్యలు తప్పక హెచ్చరించారు. అనంతరం గ్రామస్తులకు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు, తదితర వాటి గురించి అవగాహన కల్పించారు.