calender_icon.png 22 April, 2025 | 8:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవు

21-04-2025 12:00:00 AM

మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

మానకొండూర్, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): రైతులను నష్టపరిచేలా ధాన్యం తూకాల్లో మోసాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కరంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన  ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే కొనుగోలు కేంద్రాలు పని చేయాలని, తరుగు పేరిట కోత విధిస్తే చర్యలు తప్పవని అన్నారు.  వ్యాపారులు, దళారుల వద్ద ధాన్యం విక్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని ఆయన రైతులను కోరారు.

ఈ కార్యక్రమంలో మాన కొండూర్ మండల పార్టీ అధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆర్ తిరుమల్ రెడ్డి, డైరెక్టర్ వందన, తాళ్లపల్లి సంపత్ గౌడ్, నల్ల శ్రీనివాస్, ముసుగు శ్రీనివాస్ రెడ్డి, రామాంజ నేయులు, ఎం రాజయ్య, పిట్టల శ్రీనివాస్, దేవేంద్ర, కొండ్ర సురేష్ పాల్గొన్నారు.