14-04-2025 05:27:46 PM
సిఐ రవీందర్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని సిఐ రవీందర్ హెచ్చరించారు. సోమవారం ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 100 ట్రాక్టర్ల ఇసుక డంపును గుర్తించి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అక్రమంగా ఇస్తాను అనుమతి లేకుండా తరలిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణం చేపట్టేవారు ఇసుక అవసరం ఉంటే ప్రభుత్వ నిబంధనల మేరకు మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకొని తెప్పించుకోవాలని సూచించారు.