09-04-2025 12:12:35 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండ లం గుండి గ్రామంలో ఈనెల తొమ్మిదవ తేదీన జరగాల్సిన మైనర్ బాలిక వివాహాన్నీ ముందస్తు సమాచారం మేరకు జిల్లా బాలల పరిరక్షణ విభా గం అధికారుల తో కలసి తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు, కుల పెద్దలకు కౌన్సిలింగ్ నిర్వహించి బాలికను తాత్కాలిక వసతి నిమిత్తం జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్‌కు తరలించారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇరువైపులా కుటుంబ సభ్యులు, పురోహితుల పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చైల్ హెల్ప్ లైన్ కోఆర్డినేట ర్ బాల ప్రవీణ్ కుమార్, సూపర్వైజర్ లైలా, కౌన్సిలర్ చంద్రశేఖర్, రవళి, పోలీస్ కానిస్టేబుల్ పండిత్ ఉన్నారు.