calender_icon.png 17 April, 2025 | 9:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహాలు చేస్తే చర్యలు తప్పవు

08-04-2025 03:54:37 PM

తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామంలో ఈనెల తొమ్మిదవ తేదీన జరగాల్సిన మైనర్ బాలిక వివాహాన్ని ముందస్తు సమాచారం మేరకు జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో కలసి తహసిల్దార్ రోహిత్ దేశ్ పాండే బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బంధువులు, కుటుంబ సభ్యులు, కుల పెద్దలకు కౌన్సిలింగ్ నిర్వహించి బాలికను తాత్కాలిక వసతి నిమిత్తం జిల్లా కేంద్రంలోని సఖి సెంటర్ కు తరలించారు.

ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ... బాల్య వివాహాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఇరువైపులా కుటుంబ సభ్యులు, పురోహితుల పైన, నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రెండు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున బాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 18 సంవత్సరాలు నిండిన తరువాతనే వివాహము చేయాలని లేనియెడల చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1098  కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.