calender_icon.png 16 April, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా కార్యాచరణ

16-04-2025 12:52:34 AM

ఖమ్మం, ఏప్రిల్ 15 (విజయక్రాంతి):- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల లబ్ది అర్హులకు అందేలా పకడ్బందీగా కార్యాచరణ అమలుచేయాలని ఇంచార్జ్ ఖమ్మం జిల్లా కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ అన్నారు. మంగళవారం ఇంచార్జ్ కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు, భూ భారతి లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెట్టినట్లు, ఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలు లేదా యూనిట్ల ఏర్పాటుకు యువతకు సబ్సిడీతో 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఎస్సి కార్పొరేషన్ ద్వారా 29091, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 14220, బీసీ కార్పొరేషన్ ద్వారా 41881, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 6658 దరఖాస్తులు, మొత్తంగా 91850 దరఖాస్తులు సోమవారం నాటికి అందినట్లు, అన్ని దరఖాస్తులు ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేసినట్లు ఇంచార్జ్ కలెక్టర్ అన్నారు. నియోజకవర్గాల వారిగా కావాల్సిన పనుల విషయమై నివేదిక సమర్పిం చాలన్నారు.ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, మిషన్ భగీరథ ఇఇ పుష్పలత, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు పాల్గొన్నారు.