calender_icon.png 26 October, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్ బాలిక మృతికి కారణమైన బండ్ల రాజశేఖర్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి

25-10-2024 10:04:25 PM

వనపర్తి,(విజయక్రాంతి): మైనర్ బాలిక మృతికి కారణమైన బండ్ల రాజశేఖర్ రెడ్డి  పోలీసు అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు మాట్లాడుతూ... బిజ్వారం గ్రామానికి చెందిన వడ్డెర రాజేశ్వరి అనే మైనర్ బాలికను బండ్ల రాజశేఖర్ రెడ్డి అనే పేరు మోసిన సిడ్ ఆర్గనైజర్ తన ఇంట్లో పనికి పెట్టుకున్నాడు. బాలికపైన దొంగ తనం మోపి అవమానిస్తూ గద్వాల్ పోలీస్ స్టేషన్ లో కాకుండా మల్దకల్ పోలీస్ స్టేషన్ లో బాలికపై కేసుపెట్టి పోలీసులతో అనేక విధాలుగా టార్చర్ చేశాడు. ఆ బాలిక ఆత్మహత్యయత్నానికి పాల్పడి కర్నూల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించింది.

ఈ సంఘటన అత్యంత హేయమైన చర్యగా పేర్కొంటూ దీనికి పోలీసులు వత్తాసు పలుకుతూ బాలికను వేధింపులకు గురి చేయడమనేది పోలీసు వ్యవస్థకు పెద్ద మాయని మచ్చ తెచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్ట విరుద్ధ ప్రయత్నాల ప్రయత్నాలు చేసిన సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డి తో పాటు పోలీసు అధికారులు ఎవరైతే అమ్మాయి చావు కారణమైనారో వారి పైన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారు సమగ్ర విచారణ చేసి చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకోవాలని లేనిచో జిల్లా రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు కాసిం సీపిఐ నాయకులు ప్రకాష్, కార్మిక నాయకుడు ఎర్రన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు అశోక్ ,లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.